Tuesday, November 25, 2008

ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవం

ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం వారు రూ. 23.2 కోట్ల నిధులను వెచ్చించి, ఆలయాలను అన్ని విధాల అభివృద్ధి చేయడం చాలా సంతోషకరమైన విషయం. ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడం, తగిన వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి డాక్టరు Y.S. రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగిన విషయం.


Thursday, November 13, 2008

కార్తీక దీప బ్రమ్హొస్త్వ ఆలయం

ప్రదక్షిణం చేసి ద్వార వినాయకుడికి (వెండి కవచం గల రూపం) నమస్కరించి కవచంతో గల ధ్వజ స్తంభానికి నమస్కరించి స్వామి సన్నిధిలో ప్రవేశిస్తే దీపజ్యోతి కనుల పండుగ కలిగిస్తుంది. కుడి ప్రక్క ఉత్సవమూర్తి మండలం, విశ్వామిత్రుడు, పతంజలి, వ్యాఘ్రపాధుడు, అగస్యుడు, మొదలైనవారు పూజించిన శివలింగాలు, సన్నిధికి ఇరువైపులా అందమైన దీపాల వరుసలను మనం చూడవచ్చు. మొదటి ప్రాకారంలో గర్భగుడిలో ప్రధాన దైవం అరుణాచలేశ్వరుడు. తేజోమూర్తి ఐన ఈ స్వామిని అన్నామలైయార్ అని పిలుస్తారు. శోణాచలేశ్వర, ఆరుణాగిరీశ్వర, భక్తపాశవిమొచకర్, వేదమూర్తి అనే నామాంతరాలు గల ఈ అరునచలేశ్వరుని దర్శనం ముక్తిప్రదానమైనది.

అతిప్రాచీన కాలం నాటి అమూల్య ఆభరణాలు, నవరత్న ఖచ్చిత దివ్యాభరణాలను ఎంతోమంది రాజులు స్వామివారికి సమర్పించుకున్నారు. వెండి రధంలో కార్తీక బ్రమ్హొస్తవాల్లొ అరవరోజున స్వామి ఊరేగుతారు. ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే సర్వసిద్ది వినాయకుడిని, కుడివైపున పాతాళ లింగేశ్వర సన్నిధిని మనం చూడగలం. రమణ మహర్షి తపస్సు చేసిన స్తలం ఇది. గిరి ప్రదక్షిణంలో మనకు ఎన్నో ఆశ్రమాలు, ఆలయాలతో పాటు రమణ మహర్షి ఆశ్రమం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

వాతవరణంలో నెమళ్ళు, గోవులు, పచ్చని ప్రకృతితో నిండిన ఆశ్రమం మనసుకు సేదతీర్చి మరో ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకుపోతుంది. విరుపాక్ష గుహాతోపాటుగా రమణులు ఉపయోగించిన సెయ్య, పాత్రలను మనం ఇక్కడ చూడవచ్చు. కార్తీక దీపం, అడిపూరం, ఉత్తరాయణ, దక్షిణాయన పుణ్యకాలాలు, చైత్రోత్సవం, స్కంద షష్టి, ఆండాళ్ ఉత్సవం ప్రసిద్ధి చెందినవి. ఇవికాక ప్రతినెల ఉత్సవాలు కూడా విధిగా జరుగుతాయి. 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏడు ప్రాకారాలతో ఉన్నా ఈ ఆలయ శోభను వర్ణించడం కంటే దర్శిస్తేనే బాగుంటుంది.

-- మల్లాది రామలక్ష్మి,

వార్త (06.11.2008)

Wednesday, November 12, 2008

కార్తీక దీప బ్రమ్హొస్తవ ఆలయం

ప్రభుదేవరాయ రాజు ప్రార్ధనను మన్నించి సుబ్రహ్మన్నేశ్వర స్వామి స్తంభంలోనించి దర్శనమిచ్చిన ప్రదేశం. ఆ స్తంభాన్ని ఇప్పటికి మనం దర్శించుకోవచ్చు. దక్షిణాన పవిత్ర జలాలతో నిండిన శివగంగ తీర్ధం కొనేరు ఉంది. సర్వసిద్ది వినాయక ఆలయం ఈ తీర్ధం తీరాన ఉంది. కళ్యాణ సుందర మూర్తి. పెద్దనందిని ఇక్కడే మనం దర్శించవచ్చు. వల్లిదెవసేనాసమేత శన్న్ముఖుడికి ధరింప జేసిన దండాయుధం ఇప్పటికీ ఉంది. గోపురం దాటి లోనికి వెళితే శక్తి విలాస సభ కళ్యాణ మండపం కాల భైరవ సన్నిది ఉంటాయి. ఎదురుగా భ్రహ్మతీర్ధం. ఐదవ ప్రాకారంలో వెయ్యీ స్తంభాల మండపం దర్శనమిస్తుంది. దిగువ మెట్లు దిగి వెళితే పాతాల లింగ ఆలయం ఉంది. ఇక్కడ రమణ మహర్షి ధ్యాన సమాధిలో ఉండేవారు. మూడవ ప్రాకారంలో కిళి (చిలుక) గోపురం, వినాయక, సుబ్రమణ్య, భైరవ ఆలయాలున్నాయి. ఇక్కడే కంచి మండపం ఉంది. మూడవ ప్రాకారంలో వాయువ్య భాగాన అమ్మవారి సన్నిధి, ముందు మండపంలో చిత్రగుప్తుని దర్సనం, అమ్మవారి సన్నిధి, సంబంధర్ దశకం. పాలై అమ్మనై పాటలు శిలాశాసనాలు ఉన్నాయ్. అమ్మవారి మూలవిరాట్టు చిన్నరుపం శోభాయమానంగా దర్సనం ఇస్తుంది. నేరుగా కాళహస్తీశ్వర లింగం ఉంటుంది. ఈ ఆలయం ముందు వీరభద్ర, అష్టలక్ష్మిలు, సరస్వతి, రుద్ర, దుర్గరుపాలను చూడవచ్చు. వెనుక విఘ్నేశ్వరుని దర్శించాలి. అమ్మవారి ముగ్దమనోహర రూపం దర్శించినంతనే దయాసాగరిక కరుణా కటాక్షాలు మనపై అపారంగా వర్షిస్తాయి. సంస్కృతంలో ఈ అమ్మవారిని అపీత కుచంబగా పిలుస్తారు. రెండవ ప్రాకారంలో గణపతి, సుబ్రమణ్య ద్వారపాలకులు ఉంటారు. ఉతరాన ఉత్సవ విగ్రహాలు, దక్షిణాన ఇంద్రలింగం ఉన్నాయ్.

--మల్లాది రామలక్ష్మి

వార్త (06.11.2008)

Tuesday, November 11, 2008

కార్తిక దీప బ్రమ్హొస్తవ ఆలయం


14 వ శతాబ్దంలో హోయసల రాజుల రాజధానిగా అరుణాచలం ప్రసద్దిపొందింది. తంజావూరు విజయనగర, నాయక రాజులు దీన్ని పరిపాలించారు. గుడికి నాలుగు వైపులా సమున్నతంగా నాలుగు ప్రాకారాలు ఉన్నాయ్. తూర్పు రాజగోపురం అతిప్రధానమైనది. ఈ గోపురం ఎత్తు 217 అడుగులు. తమిళనాడులోనే uఉన్నతమైనది. 11 అంతస్తులు గల ఈ రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయులు నిర్మించగా తంజావూరు సేవప్పనయకరాజు సంపూర్ణం గావించారు. ఆలయం లోపల 1000 స్తంభాల మండపం, దాని ఎదురుగాగల కొనేరును శ్రీక్రిష్ణదేవరయులే నిర్మించారు. 25 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఈ ఆలయం విస్తరించింది. ఉన్నతమైన ప్రహరీ గోడలతో అత్యంత గంభీరంగా చూపరులకు సంబ్రమఆశ్చర్యాలను కలిగిస్తుందీ ఆలయం. అమ్మణ్ణి అమ్మాళ్ అనే సన్యాసిని ఉత్తర గాలిగోపురాన్ని నిర్మించడం వల్ల ఆమె పేరు మీద ఉత్తరగోపురాన్ని అమ్మణఅమ్మ గోపురమని పిలుస్తారు.

పడమటి గోపురాన్ని పిశాచగోపురమని, దక్షినగోపురాన్ని తిరుమంజిన గోపురం అని పిలుస్తారు. యాత్రికుల కోసం వసతి గృహాలు, సత్రాలు అనేకము ఉన్నాయ్. ఇక్కడ అరుణాచలంకొండయే శివస్వరూపం. గిరి ప్రదక్షిణం అంటే ఈ కొండ చుట్టూ కార్తిక పౌర్ణమి రోజున ప్రదక్షిణంగా తిరిగి రావటం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. దేవ, గందర్వ, యక్ష గణాలు సుక్ష్మ రూపంలో ఈ సమయంలో స్వామిని సేవిస్తారని భక్తుల నమ్మకం.

స్వామివారు అరునచలేశ్వరుడు, అన్నమలైయార్ . అమ్మవారు- అపీతకుచాంబ, ఉన్నమలై. తీర్ధం - బ్రహ్మ తీర్ధం. తిరుజ్ఞాన సంబందర్, అప్పర్ లాంటి నయనార్లు కీర్తించిన ప్రదేశం ఇది. పెరియపురానంలో నయనార్లు సంబందర్, అప్పర్ లు అరునచలేస్వరుని దర్శించినట్టు ఉన్నది. ఆలయానికి ముందు పెద్ద మండపం ఉంది. గాలిగోపురం పదహారు అంతస్తులు కలిగింది. గోపురంపై నాట్య కళను చాటి చెప్పే శిల్పాలు అనేకం ఉన్నాయ్. లోపలికి వెళితే కంబతిలేయవార్ సన్నిది, జ్జన పాల్ మండపం ఉన్నాయ్.
-by MALLADI RAMALAKSHMI

in VAARTHA (06.11.2008)

కార్తిక దీప బ్రమ్హోత్సవ ఆలయం


దక్షిణ భారత దేశంలో అతి పెద్ద ఆలయాలలో ఒకటైన అరుణాచలంలో కార్తిక దీప బ్రమ్హోత్సవం జరగడం భారత దేశమంతటికి తెలిసిందే. మద్రాసు, వేలూరు, కడలూరు, చిదంబరం, సేలం, తిరుచ్చి, విళుప్పురం మొదలైన అన్ని ప్రదేశాల నుండి బస్సులు వీలతయీ. తమిళనాడులోని ఈ ఆలయం శ్రీ క్రిష్ణదేవరాయుల కాలంలో ఎంతగానో అభివ్రిద్ది చెందింది. భూమి, నీరు, ఆకాశం, గాలి, అగ్ని ఈ పంచతత్వలలో అగ్నితత్వనికి చెందిన ఆలయం ఇది. అన్నామలై స్వామివారు అన్నామలై దేవితో దర్శనమిచ్చి భక్తులకు మోక్షమిచ్చే ప్రదేశం. అడిగిన వెంటనే ముక్తినిచ్చే ప్రదేశంగా స్కందపురాణంలో ఉంది. రమణ మహర్షి తపస్సు చేసి శివకారుణ్యాన్ని పొందిన పవిత్ర ప్రదేశం ఇది. రమణ మహర్షి ఆశ్రమం అత్యంత రమణీయంగా సందర్శకులకు మనోల్లాసాన్ని కల్గిస్తుంది. శివారాధనకు కార్తీకమాసం ప్రాముఖ్యం ఈ సందర్భంలో అత్యంత పవిత్రమైన అరునచలనాధుని దర్శించి తరిద్దాం.

బ్రహ్మ, విష్ణువు, ఇరువురి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది. వారి గర్వాన్ని అణ్చెందుకని శివుడు తెజోరూపంలో అద్యంతరహితంగా ఆవిర్భవించాడు. ఆ తెజోముర్తి తుది, మొదలును కనుగొనటంలో విపలమైన బ్రహ్మ-విష్ణువు శివుని ప్రార్దిస్తారు. శివుడు ప్రత్యక్సమై జ్యోతిరూపంలో కొండమీద కార్తీకమాసంలో దీపోస్త్వానికి అత్యంత ప్రాదాన్యత ఉంది. నవంబర్-డిసెంబర్ తమిళ నెలల్లో ఈ దీపోస్త్వాన్ని నిర్వహిస్తారు. 9 రోజులపాటు ఉత్సవాలు నయనానందకరంగా సాగుతాయి. పరవడి దినమైన పదవరోజున అరునచలేస్వరుని సన్నిధిలో భరణి దీపం అనే 5 దీపాలను వెలిగిస్తారు. అరుణాచలం కొండపై ఈ దీపోస్త్వం నాడు పెద్ద రాగి పాత్రలో గుడ్డతో చేసిన వత్తులను చేసి నెయ్యి పోసి, కర్పూరంతో సుదూర ప్రాంతాల వరకూ కనబడేలా దీపాన్ని మహోజ్వల కాంతితో వెలిగేలా ప్రజ్వలింప జేస్తారు. ఇక్కడ తప్ప మరెక్కడా ఇంతటి భారీగా దీపోస్త్వాన్ని తిలకించలేము. దీప కాంతులతో రాజ గోపురం దేదీప్యమానంగా వెలిగిపోతుంది.

అందమైన దీప కాంతులతో ఆలయాలు, ఇల్లు కూడా శొభాయమనమౌతయీ. కర్ర్తీక పౌర్ణమి రోజున ఆ మాసం అంతా ఉత్సవాల్లో శివ, పార్వతి, సుబ్రహ్మణ్యం, గణపతి, చందీస్వర దేవతాముర్తులను ఊరేగిస్తారు. ఈ ఉత్సవంలోని అంతరార్ధం-శరీరమే పర్వతం, మనసే పాత్ర, ప్రేమే వొత్తి, ధ్యానమే నెయ్యీ, స్వాసే కర్పూరం, ధ్యాన మార్గం ద్వారా జ్ఞాన జ్యోతిని మనం వెలిగిస్తే అగ్జాననందకారం తొలగి ప్రకాశాన్ని దర్శించగలం. ఈ దీపోస్తవ సందేశం ఇదే. అశేష జనవాహిని ఈ దీపోస్తావానికి తరలి వస్తారు. -to be continued.by MALLADI RAMALAKSHMIin VAARTHA (06.11.2008)

Saturday, November 1, 2008

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రాచీన దేవాలయాలు

మన భారత దేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. వాటి ఆలన పాలన చూసేవారు లేక శిధిలమై ఉన్నాయి. ఎన్నో ఏళ్ళ క్రితం కట్టిన అద్భుతమైన ప్రాచీన దేవాలయాలు చాలా మన భారత దేశంలో ఉన్నాయి. వాటి కట్టడాలు ఇప్పటికి సజీవంగా ఉండడం ఎంతో ఆశ్చర్యాన్ని కల్గిస్తాయి. ప్రతి ప్రాచీన దేవాలయానికి ఒక్కో పురాణ కథలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అధ్రుష్టవసాతు ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాచీన దేవాలయాలు జీర్నోద్దరణకు నోచుకుంటూ ఉన్నాయి. ఇది చాలా శుభపరినామము. అటువంటి ప్రాచీన దేవాలయాలు, వాటి చరిత్ర, పురాణ కథలు ఈ బ్లాగు ద్వారా అందించాలని నా తాపత్రయము. అందుకే ముందుగా ఆంధ్ర ప్రదేశ్ లో నెల్లూరు జిల్లాలోని కొన్ని పురాతన దేవాలయాలను సందర్శించి వాటి వివరాలు సేకరించి త్వరలో ఈ బ్లాగు ద్వారా ప్రపంచానికి తెలియజేయలనేది నా సంకల్పం. నా ఈ సంకల్పానికి భగవంతుని కృప, సహాయం ఉండగలదని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.