Thursday, November 13, 2008

కార్తీక దీప బ్రమ్హొస్త్వ ఆలయం

ప్రదక్షిణం చేసి ద్వార వినాయకుడికి (వెండి కవచం గల రూపం) నమస్కరించి కవచంతో గల ధ్వజ స్తంభానికి నమస్కరించి స్వామి సన్నిధిలో ప్రవేశిస్తే దీపజ్యోతి కనుల పండుగ కలిగిస్తుంది. కుడి ప్రక్క ఉత్సవమూర్తి మండలం, విశ్వామిత్రుడు, పతంజలి, వ్యాఘ్రపాధుడు, అగస్యుడు, మొదలైనవారు పూజించిన శివలింగాలు, సన్నిధికి ఇరువైపులా అందమైన దీపాల వరుసలను మనం చూడవచ్చు. మొదటి ప్రాకారంలో గర్భగుడిలో ప్రధాన దైవం అరుణాచలేశ్వరుడు. తేజోమూర్తి ఐన ఈ స్వామిని అన్నామలైయార్ అని పిలుస్తారు. శోణాచలేశ్వర, ఆరుణాగిరీశ్వర, భక్తపాశవిమొచకర్, వేదమూర్తి అనే నామాంతరాలు గల ఈ అరునచలేశ్వరుని దర్శనం ముక్తిప్రదానమైనది.

అతిప్రాచీన కాలం నాటి అమూల్య ఆభరణాలు, నవరత్న ఖచ్చిత దివ్యాభరణాలను ఎంతోమంది రాజులు స్వామివారికి సమర్పించుకున్నారు. వెండి రధంలో కార్తీక బ్రమ్హొస్తవాల్లొ అరవరోజున స్వామి ఊరేగుతారు. ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే సర్వసిద్ది వినాయకుడిని, కుడివైపున పాతాళ లింగేశ్వర సన్నిధిని మనం చూడగలం. రమణ మహర్షి తపస్సు చేసిన స్తలం ఇది. గిరి ప్రదక్షిణంలో మనకు ఎన్నో ఆశ్రమాలు, ఆలయాలతో పాటు రమణ మహర్షి ఆశ్రమం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

వాతవరణంలో నెమళ్ళు, గోవులు, పచ్చని ప్రకృతితో నిండిన ఆశ్రమం మనసుకు సేదతీర్చి మరో ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకుపోతుంది. విరుపాక్ష గుహాతోపాటుగా రమణులు ఉపయోగించిన సెయ్య, పాత్రలను మనం ఇక్కడ చూడవచ్చు. కార్తీక దీపం, అడిపూరం, ఉత్తరాయణ, దక్షిణాయన పుణ్యకాలాలు, చైత్రోత్సవం, స్కంద షష్టి, ఆండాళ్ ఉత్సవం ప్రసిద్ధి చెందినవి. ఇవికాక ప్రతినెల ఉత్సవాలు కూడా విధిగా జరుగుతాయి. 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏడు ప్రాకారాలతో ఉన్నా ఈ ఆలయ శోభను వర్ణించడం కంటే దర్శిస్తేనే బాగుంటుంది.

-- మల్లాది రామలక్ష్మి,

వార్త (06.11.2008)