Tuesday, November 11, 2008

కార్తిక దీప బ్రమ్హొస్తవ ఆలయం


14 వ శతాబ్దంలో హోయసల రాజుల రాజధానిగా అరుణాచలం ప్రసద్దిపొందింది. తంజావూరు విజయనగర, నాయక రాజులు దీన్ని పరిపాలించారు. గుడికి నాలుగు వైపులా సమున్నతంగా నాలుగు ప్రాకారాలు ఉన్నాయ్. తూర్పు రాజగోపురం అతిప్రధానమైనది. ఈ గోపురం ఎత్తు 217 అడుగులు. తమిళనాడులోనే uఉన్నతమైనది. 11 అంతస్తులు గల ఈ రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయులు నిర్మించగా తంజావూరు సేవప్పనయకరాజు సంపూర్ణం గావించారు. ఆలయం లోపల 1000 స్తంభాల మండపం, దాని ఎదురుగాగల కొనేరును శ్రీక్రిష్ణదేవరయులే నిర్మించారు. 25 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఈ ఆలయం విస్తరించింది. ఉన్నతమైన ప్రహరీ గోడలతో అత్యంత గంభీరంగా చూపరులకు సంబ్రమఆశ్చర్యాలను కలిగిస్తుందీ ఆలయం. అమ్మణ్ణి అమ్మాళ్ అనే సన్యాసిని ఉత్తర గాలిగోపురాన్ని నిర్మించడం వల్ల ఆమె పేరు మీద ఉత్తరగోపురాన్ని అమ్మణఅమ్మ గోపురమని పిలుస్తారు.

పడమటి గోపురాన్ని పిశాచగోపురమని, దక్షినగోపురాన్ని తిరుమంజిన గోపురం అని పిలుస్తారు. యాత్రికుల కోసం వసతి గృహాలు, సత్రాలు అనేకము ఉన్నాయ్. ఇక్కడ అరుణాచలంకొండయే శివస్వరూపం. గిరి ప్రదక్షిణం అంటే ఈ కొండ చుట్టూ కార్తిక పౌర్ణమి రోజున ప్రదక్షిణంగా తిరిగి రావటం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. దేవ, గందర్వ, యక్ష గణాలు సుక్ష్మ రూపంలో ఈ సమయంలో స్వామిని సేవిస్తారని భక్తుల నమ్మకం.

స్వామివారు అరునచలేశ్వరుడు, అన్నమలైయార్ . అమ్మవారు- అపీతకుచాంబ, ఉన్నమలై. తీర్ధం - బ్రహ్మ తీర్ధం. తిరుజ్ఞాన సంబందర్, అప్పర్ లాంటి నయనార్లు కీర్తించిన ప్రదేశం ఇది. పెరియపురానంలో నయనార్లు సంబందర్, అప్పర్ లు అరునచలేస్వరుని దర్శించినట్టు ఉన్నది. ఆలయానికి ముందు పెద్ద మండపం ఉంది. గాలిగోపురం పదహారు అంతస్తులు కలిగింది. గోపురంపై నాట్య కళను చాటి చెప్పే శిల్పాలు అనేకం ఉన్నాయ్. లోపలికి వెళితే కంబతిలేయవార్ సన్నిది, జ్జన పాల్ మండపం ఉన్నాయ్.
-by MALLADI RAMALAKSHMI

in VAARTHA (06.11.2008)